Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన – అంతర్జాతీయ దౌత్యం మరియు వ్యూహాత్మక ఒప్పందాలు

సందర్భం:

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 43 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నార్వేలో తొలి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం సోమవారం ఓస్లో చేరుకున్నారు, ఈ పర్యటనలో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా మరియు ప్రపంచ దేశాల మధ్య నడుస్తున్న సైనిక ఘర్షణల పరిష్కారం ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.

ద్వైపాక్షిక చర్చలు మరియు నార్డిక్-భారత్ శిఖరాగ్ర సదస్సు:

  • ప్రధాని నరేంద్ర మోదీ నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ తో ప్రత్యేకంగా భేటీ అయి నూతన మార్కెట్ల అన్వేషణ మరియు అత్యాధునిక సాంకేతిక సహకారంపై వ్యాపార సదస్సులో ప్రసంగించనున్నారు.
  • ఈ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు జరిగే 3నార్డిక్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు, ఇది నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు డెన్మార్క్ దేశాల అధినేతలను ఒకే వేదికపైకి తెస్తుంది.
  • గతేడాది పహల్గామ్ దాడి మరియు భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన 4 రోజుల ఉద్రిక్తతల కారణంగా రద్దయిన ఈ సదస్సును ప్రస్తుత పర్యటనలో అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నారు.
  • ఈ పర్యటనలో భాగంగా భారత్, నార్వే దేశాల మధ్య అత్యంత కీలకమైన 3 ప్రభుత్వ స్థాయి ప్రాథమిక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరే అవకాశం ఉంది.

ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక చర్చల్లో భాగంగా ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న ఉక్రెయిన్, ఇరాన్ మరియు గాజా సంక్షోభాల నివారణపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు.

భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం:

  • నార్వే పర్యటనకు ముందు శని, ఆదివారాల్లో నెదర్లాండ్స్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం‘ స్థాయికి పెంచారు.
  • వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్, నెదర్లాండ్స్ దేశాలు ఉమ్మడిగా 17 నూతన ఒప్పందాలు మరియు పత్రాలపై సంతకాలు చేశాయి.

భారత విదేశాంగ విధానం మరియు ఆర్కిటిక్ ప్రాంత ప్రాధాన్యత భారత్ – నార్డిక్ దేశాల సంబంధాల ప్రాధాన్యత:

  • నార్డిక్ దేశాలు (ఉత్తర యూరప్ ప్రాంతం) సాంకేతికత, హరిత ఇంధనం (గ్రీన్ ఎనర్జీ), పర్యావరణ పరిరక్షణ మరియు సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో (Blue Economy) ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాయి.
  • ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజ వాయువు ఎగుమతిదారులలో ఒకటైన నార్వేతో సంబంధాలు భారతదేశ ఇంధన భద్రతకు అత్యంత కీలకం.

భారతదేశ ఆర్కిటిక్ విధానం (Arctic Policy):

  • నార్వే దేశం ఆర్కిటిక్ కౌన్సిల్ లో కీలక సభ్యదేశం కాగా, భారతదేశం ఈ కౌన్సిల్ లో ‘అబ్జర్వర్‘ (పరిశీలకుడు) హోదాను కలిగి ఉంది.
  • ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణ మార్పులపై పరిశోధనలు చేయడానికి భారతదేశం 2008 లో నార్వేలోని స్వాల్‌బార్డ్ లో ‘హిమాద్రి‘ పేరుతో ఒక శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది.
  • అంతర్జాతీయ దౌత్యంలో భాగంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి నార్వే మరియు ఇతర నార్డిక్ దేశాలు సుదీర్ఘ కాలంగా మద్దతు ఇస్తున్నాయి.

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.