Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

మిడిల్ ఈస్ట్ డిప్లొమసీ

సందర్భం:

  • ఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అబ్రహాం ఒప్పందాలను (Abraham Accords) మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఇరాన్‌తో కుదిరే ఏ శాంతి ఒప్పందమైనా ఇజ్రాయెల్‌కు రక్షణ గ్యారెంటీ ఇవ్వాలనే వ్యూహంతో.. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ వంటి ముస్లిం మెజార్టీ దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయాలని ట్రంప్ డిమాండ్ చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతృప్తి చేసుకుంది.

అబ్రహాం ఒప్పందాల మూలాలు మరియు ప్రస్తుత పరిణామాలు:

  • ఒప్పందం యొక్క నిర్వచనం: ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను సాధారణీకరించడమే (Normalisation of Relations) లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన చారిత్రాత్మక అంగీకారాలే ‘అబ్రహాం ఒప్పందాలు’. యూదు, ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఉన్న ఉమ్మడి ‘అబ్రహామిక్’ మూలాల ఆధారంగా వీటికి ఈ పేరు పెట్టారు.
  • తొలి విడత సంతకాలు: ట్రంప్ తొలి విడత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, 2020 లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బహ్రెయిన్, సూడాన్ మరియు మొరాకో దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కాగా, కజకిస్థాన్ గత ఏడాది నవంబర్‌లో ఇందులో లాంఛనంగా చేరింది.
  • నిబంధనలు: ఈ ఒప్పందంపై సంతకం చేసే దేశాలు ఇజ్రాయెల్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించడంతో పాటు వాణిజ్యం, పర్యాటకం, రక్షణ మరియు భద్రతా రంగాలలో నేరుగా సహకరించుకోవాల్సి ఉంటుంది.

ట్రంప్ సరికొత్త ముస్లిం దేశాల రోడ్‌మ్యాప్ మరియు అంతర్జాతీయ సవాళ్లు:

  • ప్రాంతీయ విస్తరణ డిమాండ్: ఇరాన్ శాంతి చర్చల మెలికలో భాగంగా తొలుత సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఇందులో చేరాలని, ఆ తర్వాత పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్ దేశాలు వీటిని అనుసరించాలని అమెరికా కోరుతోంది. వీలైతే ఇరాన్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేయాలనేది ట్రంప్ ఆలోచన.
  • సౌదీ, ఖతార్ దేశాల ససేమిరా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరబ్ దేశాలు ఇందులో చేరడం కష్టంగా మారింది. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా దక్కే వరకు ఇజ్రాయెల్‌తో ఎలాంటి దౌత్య సంబంధాలు పెట్టుకోబోమని సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
  • రక్షణ మంత్రి ప్రకటన: అబ్రహాం ఒప్పందాల విస్తరణ పిలుపు పాకిస్థాన్‌ను తీవ్రమైన ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ను గుర్తించని పాకిస్థాన్.. ఈ ఒప్పందంలో చేరితే స్వదేశంలో తీవ్ర రాజకీయ, సామాజిక తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తాము అబ్రహాం ఒప్పందాలలో చేరబోమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టమైన ప్రకటన చేశారు.

పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాలు – భౌగోళిక రాజకీయాలు:

  • అరబ్-ఇజ్రాయెల్ వైరుధ్యం: 1948 లో ఇజ్రాయెల్ ఆవిర్భావం తర్వాత అరబ్ దేశాలు దానిని శత్రుదేశంగా చూశాయి. అయితే, ప్రాంతీయంగా షియా ముస్లిం మెజార్టీ దేశమైన ఇరాన్ యొక్క అణు సామర్థ్య విస్తరణను, ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి సున్నీ ముస్లిం దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియాలు ఇజ్రాయెల్‌తో పరోక్షంగా చేతులు కలపడానికి అబ్రహాం ఒప్పందాలు పునాదిగా మారాయి.
  • పాలస్తీనా సమస్య: అబ్రహాం ఒప్పందాలు అరబ్-ఇజ్రాయెల్ వాణిజ్యాన్ని పెంచినప్పటికీ, అవి పశ్చిమాసియాలోని అసలు సమస్య అయిన ‘పాలస్తీనా సంక్షోభాన్ని’ మరియు ‘ద్వి-దేశ పరిష్కారాన్ని’ (Two-State Solution) పక్కనబెట్టాయనే విమర్శ ఉంది. అందుకే హమాస్, హెజ్బొల్లా వంటి సాయుధ సంస్థలు మరియు ఇరాన్ దేశం ఈ ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అబ్రహాం ఒప్పందాల పరిణామాలు – భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలు:

  • 2యూ2 (I2U2) కూటమి ఆవిర్భావం: అబ్రహాం ఒప్పందాల ఫలితంగానే పశ్చిమాసియాలో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడింది. దీనివల్ల భారతదేశం (India), ఇజ్రాయెల్ (Israel), యూఏఈ (UAE), అమెరికా (USA) దేశాలతో కూడిన ‘I2U2’ అనే సరికొత్త చతుర్భుజ కూటమి ఏర్పాటయింది. దీనిని అంతర్జాతీయ నిపుణులు ‘పశ్చిమ ఆసియా క్వాడ్’ (West Asian Quad) గా అభివర్ణిస్తారు.
  • ఐమెక్ (IMEC) కారిడార్: జీ20 (G20) వేదికగా ప్రకటించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) విజయవంతం కావాలన్నా అబ్రహాం ఒప్పందాల విస్తరణే కీలకం. భారతదేశం నుండి యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు ఇజ్రాయెల్ లోని ‘హైఫా’ రేవు మీదుగా ఐరోపాకు రవాణా గొలుసును నిర్మించాలనే భారత వ్యూహానికి పశ్చిమాసియాలో శాంతి అత్యంత ఆవశ్యకం.

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.