సందర్భం:
- వ్యూహాత్మక ఒప్పందం: న్యూఢిల్లీలో జరిగిన 11 వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం వేదికగా భారతదేశం, అమెరికా దేశాలు సాంకేతిక రంగ సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
- చైనాకు ప్రతివ్యూహం: అరుదైన ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరాపై చైనా విధిస్తున్న ఎగుమతి ఆంక్షలను తిప్పికొట్టడమే లక్ష్యంగా “సెల్యూరింగ్ ఆఫ్ సప్లై ఇన్ ది మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్స్” పేరిట ఈ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశారు.
ద్వైపాక్షిక మరియు క్వాడ్ కూటమి రక్షణ వ్యూహాలు:
- భారత్-అమెరికా మైత్రి: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ల మధ్య జరిగిన ఈ ఒప్పందం.. అరుదైన ఖనిజాల తవ్వకాలు (Mining), ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు వాటికి సంబంధించిన పెట్టుబడులను పరస్పరం పెంపొందించుకోవడానికి ఉద్దేశించబడింది. ఫిబ్రవరి 2025 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటనలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
- క్వాడ్ దేశాల $20 బిలియన్ల నిధి: ఇరు దేశాల ఒప్పందంతో పాటు.. క్వాడ్ కూటమిలోని నాల్గు సభ్య దేశాలైన ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, మరియు అమెరికా కలిసి ఉమ్మడిగా మరొక ప్రత్యేక క్లిష్టమైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని కింద ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు 20 బిలియన్ డాలర్ల నిధిని సమీకరించి, చైనాకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన సరఫరా గొలుసును (Stable Supply Chains) నిర్మించనున్నారు.

పాక్స్ సిలికా (Pax Silica) చొరవ మరియు అంతర్జాతీయ పెట్టుబడులు:
• వ్యూహాత్మక కూటమి: ఈ తాజా ఒప్పందం ఫిబ్రవరి 20, 2026 న భారతదేశం అధికారికంగా సంతకం చేసిన అమెరికా నేతృత్వంలోని ‘పాక్స్ సిలికా’ (Pax Silica) చొరవ ఆధారంగా రూపొందించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్ రంగాలు మరియు గ్రీన్ ఎనర్జీకి అవసరమయ్యే సిలికాన్, ఇతర క్లిష్టమైన ఖనిజాలపై ఏకైక దేశం (Single-Source Monopoly) యొక్క గుత్తాధిపత్యాన్ని తగ్గించడం ఈ అంతర్జాతీయ కూటమి ముఖ్య ఉద్దేశం.
• అమెరికా ఆర్థిక మద్దతు: క్లిష్టమైన ఖనిజాల రక్షణ ప్రాజెక్టుల కోసం అమెరికా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి దాదాపు 30 బిలియన్ డాలర్ల పైగా రుణాలు, పెట్టుబడుల రూపంలో నిధులను సమీకరిస్తోంది.
అరుదైన ఖనిజాలు (Rare Earth Elements – REE) అంటే ఏమిటి?:
• నిర్మాణం: ఆవర్తన పట్టికలో (Periodic Table) ఉండే 15 ల్యాంతనైడ్స్ (Lanthanides) తో పాటు స్కాండియం (Scandium), యిట్రియం (Yttrium) లతో కలిపి మొత్తం 17 రసాయన మూలకాలను అరుదైన ఖనిజాలు అంటారు. ఇవి భూమిపై తక్కువ పరిమాణంలో లభించడం వల్ల కాకుండా, వీటిని ఖనిజాల నుండి వేరుచేసి శుద్ధి చేయడం (Processing and Refining) అత్యంత క్లిష్టమైనది మరియు ఖరీదైనది కావడంతో వీటికి ఆ పేరు వచ్చింది.
• ఉపయోగాలు: ఇవి ఆధునిక రక్షణ మరియు సాంకేతిక రంగాలకు వెన్నెముక వంటివి. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల (EVs) మోటార్లు, విండ్ టర్బైన్లు, రాడార్ వ్యవస్థలు, మరియు క్షిపణుల గైడెన్స్ సిస్టమ్స్‌లో వాడే శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాల (Permanent Magnets) తయారీకి ఇవి అత్యంత ఆవశ్యకమైనవి.
చైనా గ్లోబల్ మోనోపాలి (Global Monopoly) మరియు వ్యూహాత్మక సవాళ్లు:
• చైనా లభ్యత మరియు ప్రాసెసింగ్: ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న అరుదైన ఖనిజాల నిల్వలలో చైనా వాటా అత్యధికంగా ఉంది. కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, ఈ ఖనిజాలను శుద్ధి చేసే ప్రపంచ ప్రాసెసింగ్ సామర్థ్యంలో (Refining Capacity) చైనా ఏకంగా 91 శాతం నియంత్రణను కలిగి ఉంది.
• ఖనిజాల దౌత్యం (Resource Weaponization): అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, చైనా 2025 లో గాలియం, జర్మనియం, గ్రాఫైట్ వంటి వ్యూహాత్మక లోహాల ఎగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. దీనివల్ల అంతర్జాతీయంగా హై-టెక్ పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయి. ఈ భౌగోళిక రాజకీయ బ్లాక్‌మెయిల్‌ను (Geopolitical Leverage) ఎదుర్కోవడానికే భారతదేశం అమెరికా నేతృత్వంలోని మినరల్ సెక్యూరిటీ పార్టనర్షిప్ (MSP) మరియు తాజా పాక్స్ సిలికా (Pax Silica) ఒప్పందాల ద్వారా తన రక్షణ అవసరాలను భద్రపరుచుకుంటోంది.