Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

ఆరావళి పర్వతాల పునర్నిర్వచనం – విస్తృత ప్రజా భాగస్వామ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సందర్భం:

  • ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పర్యావరణ సున్నితమైన ఆరావళి పర్వత శ్రేణులను (Aravali Hills and Ranges) ఖచ్చితంగా నిర్వచించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిటీ కేవలం కొద్దిమంది సభ్యులకే పరిమితం కాకుండా.. స్థానిక వాటాదారులు (Stakeholders), పర్యావరణ శాస్త్రవేత్తలు మరియు గనుల నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి, ప్రజా భాగస్వామ్యం ద్వారా సమగ్ర నివేదికను రూపొందించాలని స్పష్టం చేసింది.

గనుల తవ్వకాలు మరియు పాత తీర్పుపై సుప్రీంకోర్టు ఆందోళన:

  • పాత తీర్పుపై స్టే: నవంబర్ 2025 లో సుప్రీంకోర్టు ఒక ప్రభుత్వ కమిటీ ప్రతిపాదించిన ఆరావళి నిర్వచనాన్ని సమర్థించింది. దాని ప్రకారం కేవలం 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలు, మరియు 500 మీటర్ల పరిధిలోని కొండల సమూహాలను మాత్రమే ఆరావళిగా పరిగణించారు. అయితే, ఈ నిబంధన వల్ల రాజస్థాన్‌లోని మొత్తం 12,081 కొండలలో కేవలం 1,048 కొండలకు మాత్రమే రక్షణ లభిస్తుందని, మిగిలిన తక్కువ ఎత్తు గల కొండలన్నీ రక్షణ కోల్పోయి అక్రమ గనుల తవ్వకాలకు (Unregulated Mining) గురవుతాయని కోర్టు గుర్తించింది. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా (Suo Motu) స్పందించి ఆ తీర్పుపై స్టే విధించింది.
  • కమిటీ ప్రధాన విధి: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. నూతన నిపుణుల కమిటీ కేవలం పర్వతాల సరిహద్దులను నిర్వచించడమే కాకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ చట్టబద్ధంగా ఎక్కడైనా నియంత్రిత మైనింగ్ (Regulated Mining) జరపవచ్చా అనే అంశంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది.

భూగోళశాస్త్రం – ఆరావళి పర్వత శ్రేణుల ప్రాధాన్యత మరియు పర్యావరణ సవాళ్లు

ఆరావళి పర్వతాల భౌగోళిక విశేషాలు (Geographical Features):

  • పురాతన పర్వతాలు: ఆరావళి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ముడత పర్వతాలు (Oldest Fold Mountains). ఇవి ప్రీ-క్యాంబ్రియన్ (Pre-Cambrian) యుగానికి చెందినవి. నిరంతర శైథిల్యం (Weathering) మరియు క్రమక్షయం (Erosion) కారణంగా ఇవి ప్రస్తుతం ‘అవశిష్ట పర్వతాలు’ (Residual Mountains) గా పిలవబడుతున్నాయి.
  • విస్తరణ: ఈ పర్వత శ్రేణులు నైరుతి నుండి ఈశాన్య దిశగా సుమారు 692 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఢిల్లీ (రైసినా హిల్స్ – ఇక్కడే రాష్ట్రపతి భవన్ ఉంది) వద్ద ముగుస్తాయి. వీటిలో అత్యధిక భాగం (సుమారు 80 శాతం) రాజస్థాన్ లోనే ఉంది.
  • అత్యున్నత శిఖరం: ఆరావళి పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరం గురుశిఖర్ (1,722 మీటర్లు). ఇది రాజస్థాన్ లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ అయిన మౌంట్ అబు (Mount Abu) వద్ద ఉంది.

ఆరావళి పర్వతాల పర్యావరణ మరియు ఆర్థిక ప్రాధాన్యత:

  • ఎడారీకరణ నివారణ: పశ్చిమ రాజస్థాన్ లోని థార్ ఎడారి (Thar Desert) తూర్పు వైపుకు, అనగా హర్యానా, ఢిల్లీ మైదాన ప్రాంతాల వైపుకు విస్తరించకుండా ఈ పర్వతాలు ఒక సహజ పర్యావరణ గోడలా (Ecological Barrier) అడ్డుకుంటున్నాయి.
  • నదుల జన్మస్థానం: ఈ శ్రేణుల నుండి లూని (Luni), బనాస్ (Banas), సబర్మతి (Sabarmati) వంటి ముఖ్యమైన నదులు జన్మిస్తున్నాయి.
  • పర్యావరణ ముప్పు – మైనింగ్: ఆరావళి కొండలు రాగి, జింక్, సీసం, మరియు మార్బుల్ (అమృతశిల) వంటి విలువైన ఖనిజాలకు నిలయం. అయితే, మితిమీరిన మరియు అక్రమ క్వారీయింగ్, గనుల తవ్వకాల వల్ల కొండలు కనుమరుగైపోతున్నాయి. ఇది భూగర్భ జలాల క్షీణతకు, తీవ్రమైన గాలి కాలుష్యానికి మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్ (Delhi-NCR) ప్రాంతంలో పొగమంచు (Smog) సమస్యలు పెరగడానికి దారితీస్తోంది. దీనిని అరికట్టడానికే సుప్రీంకోర్టు ‘సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ’ (CEC) నిఘాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.